Bigg Boss: రూ.10 లక్షలతో టెంప్ట్ చేసిన బిగ్ బాస్.. మధ్యలోనే టాప్ కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్!

Bigg Boss: రూ.10 లక్షలతో టెంప్ట్ చేసిన బిగ్ బాస్.. మధ్యలోనే టాప్ కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్!

కౌంట్‌డౌన్‌ మొదలైంది! కేవలం నాలుగు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో తెలిసిపోతుంది.  తమ ఫేవరేట్ సెలబ్రెటీని నిలబెట్టే ఓట్ల కోసం అభిమానులు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం టాప్ 5 లో నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతం కృష్ణ ఉన్నారు. వీరి మధ్య  పోటీ రసవత్తరంగా సాగుతోంది.

అయితే, వీరిలో అవినాష్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అతను మధ్యలోనే సెల్ఫ్ ఎలిమినేషన్ ను తీసుకుని బ్రీఫ్‌కేస్‌ను ఎంచుకోవచ్చని ఇన్నర్ టాక్. గత సీజన్‌లో, బిగ్ బాస్ తెలుగు 7లో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షలు అంగీకరించి బయటకు వెళ్లి, అభిమానులను ఆశ్చర్యపరిచారు.

ఇక ఈ ఏడాది బ్రీఫ్‌కేస్ మొత్తాన్ని రూ.10 లక్షలకు స్వల్పంగా తగ్గించినట్లు అంతర్గత వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అవినాష్.. ఈ సీజన్ 8 లో  నిజంగా బ్రీఫ్‌కేస్‌ని ఎంచుకుంటాడా లేదా అనేది ట్విస్ట్ గా మారింది.

ALSO READ | Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరు? ప్రైజ్‌మ‌నీ ఎంత? అభిమానుల టాప్ 2 కంటెస్టెంట్స్ వీరే!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. అవినాష్ గా కంటే ముక్కు అవినాష్ గానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఒకపక్క కామెడీ షోస్ చేస్తూనే.. అడపాదడపా సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. ఏదేమైనా బిగ్ బాస్ తెలుగు 8 విజేతగా ఎవరు నిలుస్తారనేది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దీంతో అందరి దృష్టి డిసెంబర్ 15పైనే ఉంది.

ఇకపోతే బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ ఎంత‌న్న‌ది సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేశాడు. ప్ర‌స్తుతం 54 ల‌క్ష‌ల 30 వేల ప్రైజ్‌మ‌నీ ఉంద‌ని చెప్పాడు. కానీ, గ్రాండ్ ఫినాలే వరకు అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని విషయాన్ని వెల్లడించాడు, ఇక గెలిచిన కంటెస్టెంట్కి కారు కూడా గిఫ్ట్గా ఉంటుందని నాగార్జున‌ తెలిపాడు.

  • Beta
Beta feature