Bigg Boss: ఈ వారం (Nov30) ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరే.. టికెట్ టు ఫినాలేలోకి వెళ్ళింది ఎవరంటే.?

Bigg Boss: ఈ వారం (Nov30) ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరే.. టికెట్ టు ఫినాలేలోకి వెళ్ళింది ఎవరంటే.?

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరిదశకు చేరింది. ప్రస్తుతం పదమూడో వారం పోటాపోటీగా జరుగుతోంది. గ్రాండ్ ఫినాలేకు చేరుకునే కంటెస్టెంట్స్‌ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడు హౌస్లో మొత్తం తొమ్మిది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో నబీల్, అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ ఉన్నారు.

ఇక ఈ వారం నామినేషన్లో గౌతమ్, విష్ణుప్రియ, అవినాష్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ, నబీల్ 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, వీరిలో ఒకరు ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే వారం మరో ఇద్దరు.. ఇలా గ్రాండ్ ఫినాలేకు చేరేది ఎవ్వరన్నది ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించి వారితో టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడిస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లోకి రెండు జంటలు వచ్చాయి. వారిలో ఫస్ట్ డే నిఖిల్, హారికలు వచ్చి.. రోహిణిని కంటెండర్‌ని చేశారు. ఇక సెకండ్ డే మానస్, ప్రియాంకలు వచ్చి.. అవినాష్‌ని కంటెండర్‌ని చేశారు.

ఇక చివరిదైన మూడో కంటెండర్ రేస్‌ని నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి, వితిక షెరులు వచ్చారు. వీరిద్దరూ కలిసి గౌతమ్ వర్సెస్ నిఖిల్‌లను పోటీదారులగా సెలెక్ట్ చేశారు. ఇక టికెట్ టు ఫినాలేలో పాల్గొనకుండా విష్ణుప్రియ, నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జీలు వచ్చాయి. అయితే, మొదటి ఐదు స్థానాల్లో తమ స్థానాన్ని ఎవరు కాపాడుకుంటారు? గ్రాండ్ ఫినాలేకి ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో? చూడాల్సి ఉంది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు టాక్. 

Also Read :- అల్లు అర్జున్ చెప్పినట్టుగానే మలయాళ లిరిక్స్తో పీలింగ్స్ సాంగ్

ఇకపోతే.. ఈ వారం నామినేషన్ కంటెస్టెంట్స్లో నిఖిల్ టాప్లో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత గౌతమ్ నిలిచాడు. ఇక మూడో ప్లేస్లో న‌బీల్, నాలుగు స్థానంలో ప్రేరణ, ఆ త‌ర్వాత ప్లేసుల్లో విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్‌,టేస్టీ తేజ ఉన్నారు. అయితే, ఈ వారం ఇంట్రెస్టింగ్గా నలుగురు డేంజర్ జోన్లో నిలిచారు. వారిలో పృథ్వీ, విష్ణుప్రియ, నబీల్, అవినాష్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. 

ఆన్ లైన్లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ ప్రకారం:

గౌతమ్ కృష్ణ 27% ఓటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రేరణ (14.81 %)
నిఖిల్ (14.26%)
టేస్టీ తేజ (9.34%)
అవినాష్ (8.91%)
నబీల్ (8.35 %)
పృథ్వీ (8.25%)
విష్ణుప్రియ (8.09%) ఓటింగ్‌తో నిలిచారు.

అయితే, ఈ వారం విష్ణుప్రియ, అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.