బిగ్ బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8) పదివారాలు కంప్లీట్ చేసుకుని పదకొండో వారం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, పృథ్వి, అవినాష్ ఉన్నారు. అయితే ఈ పదకొండో వారంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఎవరనేది వివరాల్లోకి వెళితే..
ఇవాళ శనివారం (నవంబర్ 16న) ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. వీకెండ్ కాబట్టి.. ఈ శని, ఆదివారాల్లో కింగ్ నాగార్జున ఆడించే ఆటలు, ఎలిమినేషన్స్ ఇంట్రెస్టింగ్గా సాగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో ఆరుగురి నామినేషన్స్‌లో.. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
ఆన్‌లైన్ పోల్ ఓటింగ్ ప్రకారం:
గౌతమ్ దాదాపు 21.76% ఓట్లతో ఎప్పటిలాగే ఓటింగ్‌తో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.
యష్మీ దాదాపు 10% ఓటింగ్తో కాస్తా వెనుకంజలో ఉంది. ఇక కాసేపటితో ముగియనున్న ఓటింగ్ ప్రక్రియతో యష్మీ.. టాప్లో ఉన్న గౌతమ్‌ను అధిగమించవచ్చనే ఉత్కంఠను పెంచుతుంది.
టేస్టీ తేజ 16.35% ఓట్లతో (మూడవ స్థానం)
పృథ్వీరాజ్ 14.41%
అవినాష్ (13.75%) వద్ద నిలకడగా ఉన్నారు.
విష్ణుప్రియ (12.07%) ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉంది. ఆరో ప్లేస్‌లో అంటే చిట్ట చివరి ప్లేస్‌లో యాంకర్ విష్ణుప్రియ ఉంది.
ఇకదీన్ని బట్టి చూస్తే.. అవినాష్, విష్ణు ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే, ఈ వారం అవినాష్ రెండో సారి మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ఈ పదకొండో వారం విష్ణుప్రియ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. అయితే టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా హౌజ్‌లోకి యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. కానీ, తన ఆటతో గ్రాఫ్ పడిపోతూ రావడం వల్ల టాప్ 5కి కూడా చేరుకుండానే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ నిండుగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ దక్కించుకున్న నబీల్ సేవ్ చేస్తే తప్ప విష్ణుప్రియకి మరో ఛాన్స్ లేదు. ఒకవేళ ఆమెను సేవ్ చేస్తే గనుక మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ రావొచ్చని చెబుతున్నారు. దీంతో ఎలిమినేషన్లో మరో సస్పెన్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఈ వారం బిగ్ బాస్ నుంచి షాకింగ్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో అనధికారిక ఓటింగ్ ప్రకారం:
గౌతమ్ ఓటింగ్‌తో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.
టేస్టీ తేజ (24.06 %)
విష్ణుప్రియ (21.34%)
అవినాష్ (21%) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు.
అయితే అనూహ్యంగా పృథ్వీరాజ్ (18.08 శాతం),
యష్మి గౌడ (16.62 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు.