Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఆ ఇద్దరు టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నది వీరే!

Bigg Boss: ఈ వారం నామినేషన్స్‌లో ఆ ఇద్దరు టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నది వీరే!

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) వాడి వేడిగా జరుగుతోంది. బిగ్బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. ఈసారి లిమిటే లేకుండా.. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్కు హామీ ఇచ్చేసిన.. ట్విస్టులు, గొడవలు కూడా అదే లెవల్లో ఇస్తూ వస్తున్నాడు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏడో వారం నామినేషన్స్ మంగళవారం (అక్టోబర్ 15న) కంప్లీట్ అయ్యాయి.

అయితే, ఈ తతంగం అంతా రెండ్రోజుల పాటు వాడివేడిగా సాగాయి. ఈ వారం 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో గౌతమ్ కృష్ణ, నిఖిల్, నాగ మణికంఠ, నబీల్, యష్మీ గౌడ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, అవినాష్‌తోపాటు తక్కువ సార్లు హ్యాట్ అందుకున్న ప్రేరణ ఉన్నారు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా వేరు చేసి కొత్తగా ఆడిస్తున్నారు. ఈ సారి నామినేషన్స్ లో నబిల్, పృథ్వీ, ప్రేరణ.. వీళ్లు ఓవర్ గా రియాక్ట్ అయి గొడవలు పెట్టుకున్నారు. 

అయితే.. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరెవరు ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారో ఓ లుక్కేద్దాం. ఈ వారం నామినేట్ ఐనా  9 మందికి ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. గత రెండు వారాల్లాగే ఈ వారం కూడా నబీల్ ఓటింగ్ లో సుమారు 19 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. రెండో ప్లేస్ లో 17 శాతం ఓట్లతో నిఖిల్ దూసుకొస్తున్నాడు.

Also Read : తక్కువ అంచనా వేయకండి: ఛాలెంజ్‌ చేస్తున్నా

మణికంఠ మూడో ప్లేస్ కొనసాగుతుండగా.. ప్రేరణ సుమారు 13 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. పృథ్వీరాజ్ 8 శాతం, యష్మీ 5 శాతం, హరితేజ 7 శాతం ఓట్లతో వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఇక డాక్టర్ బాబుకు కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అలాగే టేస్టీ తేజాకు కూడా తక్కువ ఓట్లు నమోదు అవుతున్నాయి. వీరు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్లో ఉన్నది వీరేనన్నమాట. 

కానీ, ఒక కండిషన్.. ఓటింగ్ ప్రారంభమై కొన్ని గంటలు మాత్రమే గడిచింది. కాబట్టి ఈ వారం ముగిసేలోపు ఓట్లు తక్కువ ఉన్నవాళ్ళకి ఓటింగ్ శాతం పేరుగొచ్చు కూడా. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో నిలిచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.