
బిగ్ బాస్ (Bigg Boss)..ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి..వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ. ఇప్పటికే ఏడు సీజన్‌లు దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ (Bigg Boss Telugu Season 8) రేపటి నుంచి (సెప్టెంబర్ 1) స్టార్ట్ అవ్వబోతుంది. బిగ్ బాస్ 8 తెలుగు షో ఆదివారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
తాజా సమాచారం ప్రకారం..ఇవాళే శనివారం (ఆగస్ట్ 31న) సుమారు 14 మంది వరకు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి 14 మంది వెళ్లనున్నారు అన్నమాట. ఆ తర్వాత రెండో రోజున మరికొంతమంది, అనంతరం కొన్ని వారాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. ఈ మేరకు రేపటి షోకి సంబంధించిన షూట్ ఇవాళ శనివారం రోజే జరగనుంది.
14 మంది కంటెస్టెంట్స్‌లో వీళ్ళే!
ఆదిత్య ఓం
అభయ్ నవీన్
యాంకర్ విష్ణుప్రియ
యష్మీ గౌడ
ప్రేరణ కంబం
నిఖిల్ మలియక్కల్
ఆర్జే శేఖర్ బాషా
నైనిక అనరుసు
బెజవాడ బేబక్క
నాగ మణికంఠ
కిర్రాక్ సీత
పరమేశ్వర్ హివ్రాలే
ఖయ్యూమ్ అలీ
సోనియా ఆకుల ఉన్నారు.
Also Read :- అదితిరావు హైదరీ ప్రేమ ముచ్చట్లు
ప్రస్తుతం సీజన్ 8 కి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ తెలుస్తోంది. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.