బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ 2తో పద్నాలుగో వారం మొదలైంది. ఇంకా ఈ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగించాల్సిన బిగ్బాస్ నిర్వాహకులు.. షో టైమింగ్స్లో మార్పు చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం బిగ్ బాస్ ప్రేక్షకులకు డిస్సప్పాయింట్ కలిగిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ సోమవారం (డిసెంబర్ 2) నుంచి బిగ్ బాస్ షో ప్రసార సమయంలో మార్పు ఉండనుంది. రాత్రి 10:00 గంటల నుంచి 11:00 గంటల వరకు బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవ్వనుంది. శని ఆదివారాల్లో మాత్రమే 9 గంటలకి రానుంది.
అయితే.. ఈ షో నిన్నటి వరకు (Dec 1).. (సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా టీవీ ఛానెల్‌లో రాత్రి 9:30 గంటలకు) ప్రసారం అయ్యేది. కేవలం శనివారం,ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు వచ్చేది. నార్మల్‌గా రాత్రి 9.30 గంటలకి మొదలైతే 10.30కి బిగ్‌బాస్ షో అవుతుంది. ఇక నుంచి ఆడియన్స్‌కి మరో అరగంట లేటు తప్పదన్నమాట.
ALSO READ | Bigg Boss: 13వ వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఎలిమినేటెడ్.. హౌజ్‌లో ఎంత సంపాదించారంటే?
ఇక నేటి (డిసెంబర్ 2) నుంచి మాత్రం రాత్రి 10:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ప్రసారం కానుంది. అయితే, ఈ లేటెస్ట్ సీజన్ ఇంకో రెండు వారాల్లో కంప్లీట్ కానుంది. ఈ క్రమంలో రాత్రి 9:30 గంటల నుంచి 'గీత ఎల్.ఎల్.బి' అనే కొత్త సీరియల్ను.. స్టార్ మా ప్రసారం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబందించిన సీరియల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అందులో 9:30 గంటల నుంచి ప్రసారం కానుంది అని ఉంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 92 ప్రోమోలో రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అని ఉంది. ఈ సీరియల్ ప్రసారం వల్లే బిగ్బాస్ సీజన్ 8 షో టైమింగ్స్ మార్చినట్టు తెలుస్తోంది.
అయితే.. ఇక్కడ విషయం ఏంటంటే.. రాత్రి 9:30 షో అంటేనే చూసే జనాలకి ఇబ్బందిగా ఉంది. ఇక 10 నుంచి 11 కంటే ఇక ఈ షోని ఎవరు చూస్తారంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంతవరకు చూసినోళ్లు.. ఇంకో రెండు వారాలు చూడకుండా ఉంటారా? అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.