బిగ్ బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8) వ సీజన్ పదో వారం రసవత్తరంగా సాగింది తెలిసిందే. కంటెస్టెంట్స్ ఒకరికొకరు పోటీపడుతూ, గొడవలు పెట్టుకుంటూ వారమంతా కథ నడిపిస్తు వచ్చారు. వీకెండ్లో మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్ వేసే ఓటింగ్స్తో తమ ఆటలో వేగం పెంచుతూ యష్మీ, విష్ణు స్థానాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఇకపోతే.. అందరూ ముందునుంచే ఊహించినట్టుగా బిగ్ బాస్‌లో ఒకేసారి రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. పలు అనారోగ్య కారణాలతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వ ఎలిమినేట్ కాగా.. ఇక అతి తక్కువ ఆడియన్స్ ఓట్లతో హరితేజ ఎలిమినేట్ అయింది. ఇలా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది.
అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన స్ట్రాంగ్ కంటెస్ట్ హరితేజ.. ఐదు వారాల్లో ఎంతమేరకు సంపాదించింది? రోజుకు తాను తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
Also Read:-డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు.. ఎందుకంటే?
రెమ్యునరేషన్ వివరాలు:
వైల్డ్ కార్డ్ ఎంట్రీ హరితేజ వారానికి రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. అంటే, రోజుకు సుమారు రూ. 42,857. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ.17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పవచ్చు.
అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగు 8లో విన్నర్ మెటీరియల్‌గా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా వచ్చిన నిఖిల్.. వారానికి రూ. 2,25000 రెమ్యునరేషన్ అందుకున్నట్లు
సమాచారం. దాంతో హరి తేజకి మాత్రం నిఖిల్ కన్న డబుల్ రెమ్యూనరేషన్ అని సోషల్ మీడియాలో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అంటే, నిఖిల్ కంటే హరితేజకు దాదాపుగా రూ. 75 వేలు ఎక్కువ అని తెలుస్తోంది.
ఇకపోతే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వ మాత్రం మూడున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇలా చూస్తుంటే.. హరితేజ కంటే గంగవ్వకే ఎక్కువని తెలుస్తోంది. అయితే.. హరితేజకు వారానికి 4 లక్షలు కూడా ఇచ్చినట్లు మరో టాక్ వినిపిస్తోంది. కాగా ఈ రెమ్యునరేషన్ వివరాలు అనేది.. అధికారికంగా బిగ్ బాస్ వెల్లడించింది కాదు కాబట్టి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.