జైలు నుంచి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల

చంచల్ గూడ జైలులో ఉన్న బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. 2023, డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో.. కండీషన్స్ బెయిల్ పై బయటకు వచ్చిన ప్రశాంత్.. మీడియాతో మాట్లడకుంటూ.. మీడియా కంట పడకుండా తన కారులో వేగంగా వెళ్లిపోయాడు. పల్లవి ప్రశాంత్ విడుదల అవుతున్నాడని తెలిసి.. పెద్ద సంఖ్యలో జైలు దగ్గరకు వచ్చారు అభిమానులు. వాళ్లకు కనీసం కనిపించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

పల్లవి ప్రశాంత్ కు షరతులతో బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. ప్రతి నెలా ఒకటో తేదీ, 16వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని.. సంతకం చేయాలని స్పష్టం చేసింది. బెయిల్ సందర్భంగా ఇచ్చిన కండీషన్స్ ను పాటించకపోతే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది కోర్టు. నాలుగు రోజులు జైలులో ఉన్న బిగ్ బాస్ విన్నర్.. బెయిల్ పై బయటకు రావటంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని.. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న సమయంలో.. పోలీసుల సూచనలు, సలహాలు పాటించకుండా.. తన అభిమానులను రెచ్చగొట్టటం ద్వారా అర్థరాత్రి గొడవ జరిగింది. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయిన విషయంలో తెలిసిందే.. వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు..