కోస్ట్ గార్డ్ చరిత్రలోనే హయ్యేస్ట్.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం

కోస్ట్ గార్డ్ చరిత్రలోనే హయ్యేస్ట్.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం

అండమాన్  తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది  ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.  కోస్ట్ గార్డ్  చరిత్రలో ఇప్పటివరకు పట్టుకున్న  డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు.  డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది. ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు అనే వివరాలపై ఆరాదీస్తున్నారు.

గతంలో ఇలా...

2024 ఫిబ్రవరి 28న గుజరాత్ తీరంలో అధికారులు 3,300 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డ్. దీని విలువ మార్కెట్​లో రూ.1,300 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.  అలాగే మరోసారి 2024 నవంబర్ 15న  గుజరాత్ సముద్ర తీరంలో 7 క్వింటాళ్ల డ్రగ్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేస్తున్న 8 మంది ఇరాన్ దేశస్తులను అరెస్టు చేశారు.