హైదారాబాద్ లోని బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొంతమంది దుండగులు టోకరా వేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో రూం బుక్ చేసిన నిందితులు.. బాధితుడిని అక్కడికి పిలిపించుకున్నారు.
అతడికి మాయ మాటలు చెప్పి రూ.15లక్షల నగదుతో ఉడాయించారు. మోసపోయినట్లు గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ మేరకు హోటల్ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.