
పట్నా: కేంద్ర బడ్జెట్.. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుందని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్అన్నారు. బడ్జెట్లో బిహార్‌కు ప్రాధాన్యం కల్పించినందుకు ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. "కేంద్ర బడ్జెట్ ప్రగతిశీలమైనది. ఇది రాష్ట్ర వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఆయన తెలిపారు. ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌పై కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది.
మఖానా బోర్డు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు, ఐఐటీ- పాట్నా సామర్థ్యాన్ని పెంచనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ప్రకటించారు. మఖానా బోర్డు, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్బిహార్ భవిష్యత్తు అవసరాలను తీరుస్తాయని నితీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బిహార్ కు ప్రసిద్ధి చెందిన ఫాక్స్ నట్స్ సాగును మఖానా బోర్డు ప్రోత్సహిస్తుందని తెలిపారు.