దర్బంగా: ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నించారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీహార్లో ఎయిమ్స్తో పాటు పలు అభివృద్ధి పనులకు పచ్చ జెండా ఊపేందుకు ప్రధాని మోదీ బుధవారం దర్బంగా వెళ్లారు.
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 13, 2024
ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉన్నారు. ఎన్డీయేలో జేడీయూ కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అందరూ చూస్తుండగానే వేదికపై నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి నితీష్ కుమార్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. మోదీ వద్దని చెప్పి.. నితీష్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ALSO READ | అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ : మోదీ
ప్రధాని మోదీ వయసు 74 సంవత్సరాలు కాగా సీఎం నితీష్ వయసు 73 సంవత్సరాలు. ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు బీహార్ సీఎం నితీష్ ప్రయత్నించడం ఇదేం మొదటిసారి కాదు. 2024 జూన్లో కూడా ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశంలో మోదీ పాదాలను ముట్టుకునేందుకు నితీష్ కుమార్ ఆసక్తి చూపారు. ఆ సందర్భంలో కూడా ప్రధాని మోదీ వద్దని చెప్పి కరచాలనం చేశారు.
— Amar Prasad Reddy (@amarprasadreddy) June 7, 2024
బీహార్లోని నవాడాలో లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో కూడా నితీష్ కుమార్ మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా.. దర్బాంగాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సీఎం నితీష్ ను ప్రశంసలతో ముంచెత్తారు. నితీష్ కుమార్ ఆదర్శ పాలన అందిస్తున్నారని, ప్రభుత్వాన్ని మంచిగా నడపడంలో మోడల్గా నిలిచారని చెప్పారు. బీహార్ను జంగల్ రాజ్ యుగం నుంచి బయటపడేశారని, ఈ ఘనత సాధించిన నితీష్ను పొగిడేందుకు ప్రశంసలు సరిపోవని ప్రధాని మోదీ చెప్పారు. బీహార్లో మొత్తం రూ.12,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు.