పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను రిమ్స్ దవాఖాన నుంచి డైరెక్టర్ బంగళాకు తరలించారు. నాలుగు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు కోర్టు 14 శిక్ష విధించింది. దాంతో ఆయన బిర్సా ముందా జైలులో జైలు జీవితం గడుపుతున్నారు. అయితే అనారోగ్యంతో గత కొంత కాలంగా రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. అక్కడి ప్రభుత్వం రిమ్స్ ను కరోనా ఆస్పత్రిగా మార్చింది. దాంతో లాలూను ఆస్పత్రి డైరక్టర్ బంగ్లాలోకి మార్చాలని కోరుతూ.. బిర్సా ముండా జైలు అథారిటీకి అధికారులు లేఖ రాశారు. అందుకు జైలు ఉన్నతాధికారులనుంచి అనుమతి లభించడంతో ఆయనను.. ఆస్పత్రి నుంచి డైరక్టర్ బంగ్లాకు మార్చారు. అయితే లాలూ అనారోగ్యం వల్ల జైలులో కంటే ఆస్పత్రిలో ఎక్కువగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో కరోనా కేసులు 15 వేలు దాటాయి.
For More News..