వరద సహాయ చర్యలకు వెళ్లి నదిలో ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్​​

వరద సహాయ చర్యలకు వెళ్లి నదిలో ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్​​

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో బీహార్​లో వరద బీభత్సం సృష్టిస్తున్నాయి.వరద సహాయక చర్యలకు వెళ్లిన ఆర్మీహెలికాప్టర్ సాంకేతిక లోపంతో అత్యవ సరంగా నదిలో ల్యాండ్ అయింది. హెలికాప్టర్​ లో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు  సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. 

బుధవారం(అక్టోబర్2,2024) బీహార్​ లోని ముజఫర్పూర్​జిల్లాలో ఇండియన్​ శ్రీయిర్​ఫోర్స్(IAF)కి చెందిన అడ్వాన్స్డ్​లైట్​హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్​ చేయబ డిందని అధికారులు తెలిపారు.  

ALSO READ | మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

హాయక సామాగ్రిని గాలిలో జారవిడిచిన తర్వాత దర్భంగా నుంచి హెలికాప్టర్​ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్​ సూపరిం టెండెంట్​ఆఫ్​ పోలీస్​ రాకేష్​ కుమార్​ తెలిపారు. 

హెలికాప్టర్​ ఓ రెక్క విరగడంతో ఔరాయ్​ బ్లాక్ లో వరద నీటిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. హెలికాప్టర్​ లో ఉన్న IAF సిబ్బంది, అధికారు ఉన్నారని  స్థానికులు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారని అధికారులు చెప్పారు.