
చెన్నై: దేశంలోని ప్రముఖ పరిశోధన విద్యాసంస్థలలో ప్రముఖ స్థానం పొందే భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (BIHER) మరో ముందడుగు వేసింది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ గా నిలిచేలా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హార్వార్డ్ మెడికల్ స్కూల్ అనుబంధ సంస్థలైన బ్రిగమ్ మరియు ఉమెన్స్ హాస్పిటల్స్ వారితో కాన్ఫిడెన్షియల్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (CCDA)ను కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా కేర్ డయాగ్నోస్టిక్స్ మరియు మొబైల్ మరియు టెక్ ఎనేబుల్డ్ డయాగ్నొస్టిక్ పరికరాలతో అత్యుత్తమ అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ కేవీ భాస్కర్ రాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యార్థుల మార్పిడి, జాయింట్ రీసెర్చ్ మరియు జాయింట్ గ్రాంట్స్ పొందడానికి, అలాగే మరెన్నో అద్భుతమైన పరిశోధనలకు, ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుందన్నారు.