పట్నా: ప్రభుత్వ స్కూల్ టీచర్లకు డ్రెస్ కోడ్‌ను కంపల్సరీ చేస్తూ బీహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ అవర్స్‌లో టీచర్లు, మిగతా సిబ్బంది టీ షర్ట్‌లు, జీన్స్ వేసుకురావడాన్ని నిషేధించింది. విద్యాసంస్థల్లో టీచర్లు, సిబ్బంది డీసెన్సీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
ప్రభుత్వ టీచర్లు రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించింది. డీజేలకు టీచర్లు చేసే డ్యాన్స్ రీల్స్ వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.