బీహార్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ హన్స్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే గులాబ్ యాదవ్ ఓ మహిళా న్యాయవాదిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని పాయింట్ బ్లాక్ లో తుపాకీతో బెదిరించారని బాధితురాలు తెలిపింది. వీరిద్దరిపై పాట్నాలోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమెకు అక్కడ న్యాయం జరగలేదు.
తనకు న్యాయం చేయాలని బాధితురాలు దానాపూర్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ శ్రీ వాస్తవ ఆదేశాల మేరకు బీహార్ కేడర్ (1997)ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యేపై పాట్నాలోని రూపస్ పూర్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి సంజీవ్ ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్ సీఎండీగా పని చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు 2022 మార్చిలో గులాబ్ ను ఆర్జేడీ నుంచి ఆరేండ్లపాటు సస్పెండ్ చేశారు.