
నవవధువును కొట్టిన బీహార్ పోలీస్ అధికారి ఉద్యోగం ఊడింది. పెళ్లి జరిగి పట్టుమని గంట కూడా కాలేదు. అప్పుడే తన ప్రతాపాన్ని చూపించాడు ఆ పెళ్లి కొడుకు.. పైగా అతడు పోలీస్ అధికారి కూడా .. గుళ్లో పెళ్లి చేసుకున్న భార్యను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాల్సిన భర్త.. వధువు చెంప చెళ్లుమనిపించాడు. ఇక అంతే పెళ్లికి వచ్చిన వారిలో ఓ మహిళ ఆ నవ వరుడికి అడ్డం తిరిగింది. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో.. ఆపదలో ఉన్న వారిని కాపాడాల్సిన వారే ఇలా ప్రవర్తించడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు...
బీహార్ లో ఓ పోలీస్ అధికారి పెళ్లి వీడియో వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి దండలతో కొత్త జీవితాన్ని పంచుకోవడానికి సిద్దంగా ఉన్న జంట పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరుడు కోపంతో రగిలి పోయి వధువును చెంపపై కొట్టాడు. ఈ సమయంలో ఓ మహిళన వధువును కాపాడేందుకు వచ్చింది. అంతేకాదు ఆ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లికొడుకును ( పొలీసు అధికారి) ఉద్యోగంనుంచి తొలగించారు.
In Nawada, Bihar, A policeman slapped his newly-wed bride immediately after marriage in a temple, The woman lodged a complaint after which SP Abhinav immediately suspended the inspector.
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 4, 2025
pic.twitter.com/h7a3GXhbPY
ఈ వీడియో సోషల్మీడియాలో X ట్విట్టర్ లో ఘర్ కి కాలేష్ అనే ఖాతా ద్వారా షేర్ అయింది. వైరల్ కావడంతో ఇప్పటి వరకు ( వార్త రాసే వ రకు) 339k వీక్షణలను పొందింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసినందుకు కొంతమంది సంతోషం తెలపగా.. మరికొంతమంది ఆరు నెలల పాటు సగం జీతం వస్తుంది తరువాత ఎక్కడొకచోట పోస్టింగ్ ఇస్తారు.. మళ్లీ అలాగే చేస్తాడని కామెంట్ చేశారు. . ఆజ్ కే జమానే మే అనుకూల భాగస్వామి ధుంధ్నా ముష్కిల్ హో గ్యా హై అని మరొకరు వ్యాఖ్యానించారు. ధైర్యంగా వచ్చిన మహిళను కొంతమంది ప్రశంసిస్తూ. సరైన నిర్ణయం తీసుకుందని రాసుకొచ్చారు. ప్రస్తుత రోజుల్లో వివాహ సంబంధాలు విష పూరిత సంబంధాలుగా మారుతున్నాయని ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు.