సర్దార్ నగర్ లో బీహార్ సర్పంచుల బృందం

సర్దార్ నగర్ లో బీహార్ సర్పంచుల బృందం

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ గ్రామాన్ని 40 మంది బీహార్ రాష్ట్ర సర్పంచుల బృందం గురువారం సందర్శించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పలు కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్సరీ, వైకుంఠధామం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, కంపోస్ట్ యార్డు, గ్రామపంచాయతీ కార్యాలయం తదితర వాటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ మునగపాటి నరసింహులు, పంచాయతీ కార్యదర్శి విజయసింహ ఉన్నారు.