
బీహార్: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు బీహార్లోని గయాలో దారుణ హత్యకు గురైంది. మాంఝీ మనవరాలు సుష్మా దేవిని ఆమె భర్త కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే సుష్మ హత్యకు కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సుష్మ ఇంట్లోనే ఈ ఘోరం జరిగింది. సుష్మ ఛాతిలో తుపాకీ గుండ్లను దింపిన ఆమె భర్త కాల్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
केंद्रीय मंत्री जीतन राम मांझी की नातिन की हत्या: पति ने सीने में मारी गोली। 14 साल पहले की थी अंतरजातीय शादी। गया पुलिस मामले की जांच में जुटी है।#JitanRamManjhi #MurderCase #GayaNews #BiharCrime #IntercasteMarriage #BreakingNews #BiharPolice #Bihar pic.twitter.com/yI86IVgAXZ
— FirstBiharJharkhand (@firstbiharnews) April 9, 2025
పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం మాంఝీ మనవరాలు సుష్మా దేవి, రమేష్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సుష్మా దేవితో పాటు ఇంట్లో ఆమె పిల్లలు, సోదరి పూనమ్ కుమారి కూడా ఉన్నట్లు తెలిసింది. బీహార్లోని గయా లోక్ సభ స్థానం నుంచి మాంఝీ లోక్ సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రిగా మాంఝీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read:-ఫుల్ గా మందు కొట్టి కారు యాక్సిడెంట్ చేసిన డైరెక్టర్..
సుష్మను తన భర్త కాల్చి చంపిన ఘటనపై సుష్మ సోదరి పూనమ్ పూస గుచ్చినట్టు వివరించింది. సుష్మకు, ఆమె భర్త రమేష్కు ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. కోపంతో ఊగిపోయిన సుష్మ భర్త రమేష్ గోడకు తగిలించి ఉన్న నాటు తుపాకీని తీసుకుని సుష్మను కాల్చాడు. వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుష్మ స్పాట్లోనే చనిపోయింది. పాట్నా నుంచి వెళ్లిన రమేష్ తన భార్యను కాల్చి చంపేసి వెళ్లిపోయాడు.