![పెద్ద కథే..!: తాగుబోతు భర్తను కాదని.. లోన్ రికవరీ ఏజెంట్‌ను పెళ్లాడిన మహిళ](https://static.v6velugu.com/uploads/2025/02/bihar-woman-leaves-alcoholic-husband-marries-loan-shark_Jz4wYsRMP8.jpg)
భర్తలో సగభాగం భార్య. జీవితాంతం భర్త కష్టసుఖాల్లో తోడుగా ఉండి బరువు బాధ్యతల్లో భాగం పంచుకునేది భార్య. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడంతా.. అస్సాం. ఒక్క మాటంటే పుట్టింటికి, అంతకుమించి అంటే విడాకుల నోటీసులు. ఇంకాస్త గొడవ పెద్దదైతే.. నీపోరు భరించలేను.. నా జీవితం నేను చూస్కుంటా అనే దాకా వచ్చేశారు.
గతంలో ఇలా లేదయ్యో..! భర్త ఎట్లాంటోడైనా భరించేవాళ్లు. తాగొచ్చినా తిండి పెట్టేవారు. ఏనాడైనా ఇద్దరి మధ్య మాటొస్తే, ఆ నాలుగు గోడలకు పరిమితం చేసేవారు. నలుగురికి తెలిసి నవ్వులు పాలవ్వడం ఎందుకనేది అప్పటి సతీమణులు ఆలోచన. ఇప్పుడు అలా లేదయ్యో! ఒకటే సొల్యూషన్.. ఇంటి నుండి జంప్. ఎంత విడ్డూరం కాకపోతే, భర్త తాగుబోతని భార్య లోన్ రికవరీ ఏజెంట్‌తో వెళ్లిపోతుంది చెప్పండి.
Also Read :- కారులో వర్క్ చేస్తున్న మహిళకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్
తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ.. లోన్ రికవరీ ఏజెంట్‌ను పెళ్లాడింది. ఈ ఘటన బీహార్‌లోని జముయ్ జిల్లాలో చోటుచేసుకుంది. జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ లోన్ల రికవరీ కోసం ఊరూరూ తిరిగేవాడు. ఈ క్రమంలో అతడికి నాలుగు నెలల కిందట కర్మ టాండ్ గ్రామానికి చెందిన ఇందిరా కుమారి అనే మహిళ పరిచయం అయ్యింది. ఆ సమయంలో ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో.. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇంకేముంది..! అప్పటికే తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఆమె.. అతనితో పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడటం గమనార్హం. వీరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
जमुई -शराबी पति से परेशान महिला को लोन देने वाले बैंक कर्मी से हो गया प्यार। जिसके बाद वो पति को छोड़कर प्रेमी के साथ फरार हो गयी। मंदिर में जाकर दोनों ने रचा ली शादी.#Bihar #BiharNews #Jamui pic.twitter.com/HauQ2dRdLF
— FirstBiharJharkhand (@firstbiharnews) February 12, 2025
నెటిజన్ల మద్దతు..
నిజానికి మహిళ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. అసలే ఈకాలంలో ప్రియుడి కోసం భర్తను లేపేస్తున్న భార్యలు ఎంతో మంది బయటకొస్తున్నారు, మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వాడిని మూడో కంటికి తెలియకుండా చాకచక్యంగా లేపేస్తున్నారు. వార్తలో మహిళ అటువంటి సాహసాలు చేయనందుకు సంతోషించాలి అంటున్నారు.. నెటిజన్లు. మనసుకు నచ్చిన వాడితో వెళ్ళిపోయి మంచి పనే చేసిందంటున్నారు.