ఫ్యాన్ రిపేర్ చేయడానికి అని పిలిచి పెళ్లి చేసుకుంది.. సినిమా రేంజ్ లవ్ స్టోరీ..

ఫ్యాన్ రిపేర్ చేయడానికి అని పిలిచి పెళ్లి చేసుకుంది.. సినిమా రేంజ్ లవ్ స్టోరీ..

కొన్ని లవ్ స్టోరీలు విచిత్రంగా ఉంటాయి. ఊహించని విధంగా ప్రేమలో పడుతుంటారు కొందరు. అందుకే అంటారేమో ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్యలో చిగురిస్తుందో చెప్పలేమని. ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు వీళ్ల ఫ్యాన్ కహానీ తెగ వైరల్ గా మారింది. 

బీహార్ లో జరిగింది ఈ ప్రేమ పెళ్లి. ఫ్యాన్ రిపేర్ కోసం వెళ్లడం, ఇద్దరి మధ్య పరిచయం పెరగడం.. ప్రేమకు దారి తీసిందని ఈ జంట చెప్పుకొచ్చింది. ‘‘ ఫ్యాన్ పనిచేయకపోతే మా ఊరిలో ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు. ఆమె కూడా నన్ను ఫ్యాన్ బాగుచేయాలని పిలిచింది. ఆ తర్వాత ఫోన్ నంబర్ అడిగింది. ఒక వేళ మళ్లీ ఫ్యాన్ పనిచేయకపోతే కాల్ చేయడానికి నంబర్ కావాలని అడిగింది.’’ అని చెప్పాడు. 

అయితే ఆ ఎలక్ట్రిషన్ ను చూసిన మొదట్లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ఇష్టం పెంచుకుందట ఆ అమ్మాయి. కానీ తన ఇష్టాన్ని ఎలక్ట్రిషన్ కు వెంటనే చెప్పలేదట. అయితే అతనిని చూడాలని, మాట్లాడాలని ఏదో ఒక వంకతో ఫోన్ చేసేదట. ఒకసారి ఫ్యాన్ పనిచేయడం లేదని, మరోసారి స్విచ్ పనిచేయడం లేదని, ఇంకోసారి టీవీ నడుస్తలేదని ఫోన్ చేసేదంట. అలా అప్పుడప్పుడు పిలవడం, అతను రావడంతో పరిచయం పెరిగి ప్రేమగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది. 

అయితే ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్ రిపేర్ చేసి కూడా అమ్మాయి మనసు గెలవచ్చు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మంచి కపుల్ అని, మరి కొందరు ఇద్దరూ వెరీ క్యూట్ గా ఉన్నారు.. చక్కని జంట అని మెచ్చుకుంటున్నారు. ‘‘చాలా బాగుంది వీళ్ల లవ్ స్టోరీ.. అలాగైతే పంక్చర్ వేసే వాళ్లకు దూరంగా ఉండండి’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో కామెంట్లతో ఈ ఫ్యాన్ రిపేర్ లవ్ స్టోరీ ట్రెండింగ్ అవుతోంది.