వీడియో: ప్రేమ పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. ప్రియుడే కావాలని పట్టుబట్టిన ప్రియురాలు

వీడియో: ప్రేమ పెళ్లికి నో చెప్పిన పెద్దలు.. ప్రియుడే కావాలని పట్టుబట్టిన ప్రియురాలు

వయస్సు మీద కొచ్చేసరికి ఆకర్షణకు లోనై యువత ప్రేమలో పడటం ఎంత సర్వసాధరణమో.. ఆ ప్రేమను కాదనటం పెద్దలకు అంతే మాములే. ఇక్కడ ప్రేమలో పడిన పిల్లలది తప్పా..! కాదని నిర్ణయం తీసుకునే తల్లిదండ్రులదిద తప్పా..! అనేది చెప్పలేం. ఎందుకంటే పెద్దలు వెనుక ముందు అన్నీ విచారించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన జంటలు విడిపోకుండా లేరు. అలా అని పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న వారందరూ అన్యోన్యంగా లేరు. ఇలానే ఓ ప్రేమ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. 

బీహార్, జముయ్ జిల్లాలోని టెటారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి(20) అనే యువతి, సమీప ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ అనే యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కూతురు ప్రేమించిన యువకుడు నిరుద్యోగి కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగి అయిన ముంగేర్ జిల్లాకు చెందిన మరో వ్యక్తితో యువతికి వివాహం నిశ్చయించారు. మార్చి 11న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు సమయం దగ్గరపడుతుండడంతో ఇరు కుంటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇదే అదునుగా భావించి యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. నేరుగా ప్రియుడి దగ్గరికి వెళ్లి.. అనంతరం ఇద్దరూ స్థానిక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆపై యువతి ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ కోసం యువకుడి గ్రామానికి వెళ్లారు. అక్కడున్న యవతిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె అందుకు అంగీకరించలేదు. ప్రియుడే తన జీవితమని, అతని వదిలి వెళ్లనని తేల్చిచెప్పింది. 

ఎలాగోలా అక్కడినుంచి ప్రేమికులిద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు.. వారిని విచారించి ఇద్దరూ మేజర్లు కావడంతో చివరకు ఇంటికి పంపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి ప్రేమపై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.