అసోంలో బిహు డ్యాన్స్పై వర్క్ షాప్

గౌహతి: అసోంలో బిహు డ్యాన్స్ పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. సొనిట్పూర్లోని తేజ్పూర్లో బిహు డ్యాన్స్, డోలు వాయించడం పై వర్క్ షాప్ నిర్వహించారు. పంట సీజన్ ప్రారంభం సందర్భంగా అసోంలో బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. అస్సామీల కొత్త సంవత్సరాది ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 14 నుంచి 16 వరకు బిహు ఉత్సవాలు జరగనున్నాయి. 
కరోనా ఆంక్షల కారణంగా దాదాపు రెండేళ్లుగా అన్ని రకాల ఉత్సవాలకు దూరమైన ప్రజలు.. ఈసారి ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోవడంతో ఉత్సవాల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సంతోషంగా వేడుకలు జరుపుకునేందుకు చిన్నారులు, యువత ఉత్సాహంగా డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

పంజాబ్ అధికారులతో భేటీ.. వివాదంలో కేజ్రీవాల్..

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం.

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్