- సంక్రాంతి తర్వాత బీజాపూర్ హైవే పనులు స్పీడప్
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- చేవెళ్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్నేషనల్ హైవే పనులు సంక్రాంతి తర్వాత వేగవంతం అవుతాయని, ఏడాది లోపే పూర్తిచేసేలా టార్గెట్పెట్టుకున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి చేవెళ్ల మండలంలో ప్రాథమిక వ్యవసాయ, సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించారు.
ముడిమ్యాల గేట్ నుంచి మేడిపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రూ.40లక్షల సొంత ఖర్చుతో వ్యవసాయ సహకార భవనం నిర్మించిన చేవెళ్ల సొసైటీకి దేవర సమత వెంకటరెడ్డి రైతులను అభినందించారు. డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.