పాపం.. ఇద్దరూ 30 ఏళ్ల లోపు కుర్రాళ్లు.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర విషాద ఘటన

పాపం.. ఇద్దరూ 30 ఏళ్ల లోపు కుర్రాళ్లు.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర విషాద ఘటన

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్పై అతి వేగంగా వెళుతూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. ట్రిపుల్ ఐటి చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ మార్గంలో అతివేగం వల్లే బైక్ అదుపు చేయలేక డివైడర్ను ఢీ కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

చనిపోయిన యువకులను అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వైజాగ్కు చెందిన దేవరకుమార్ స్వామి (25), గాజులరామారంలో నివాసం ఉంటున్న వెంకన్న స్వామిగా (30) పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కు గచ్చిబౌలి పోలీసులు తరలించారు. గచ్చిబౌలి దగ్గర ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.

ALSO READ | హైదరాబాద్లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్కు ఈ సంగతి తెలిస్తే అంతే..!

గచ్చిబౌలి ప్రాంతం ఐటీ ఉద్యోగులకు అడ్డా లాంటిది. హైదరాబాదులో నైట్ లైఫ్‌కి పేరుగాంచిన డీఎల్‌ఎఫ్ స్ట్రీట్ గచ్చిబౌలిలోనే ఉంది. పగలూరాత్రి అనే తేడా లేకుండా నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఫేమస్ 5స్టార్ హోటల్స్, మాల్స్ గచ్చిబౌలిలోనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ప్రాంతంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.