
నల్లగొండ జిల్లా : నార్కట్పల్లి మండల కేంద్రం జాతీయ రహదారిపై రెండు బైక్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నార్కట్పల్లి నుంచి చిట్యాల రోడ్డుకి రాంగ్ రూట్లో వచ్చి మరో బైక్ని ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్స్ తుక్కుతుక్కు అయ్యాయి. రాంగ్ రూట్ వెళ్లడమే తప్పయితే అతి వేగంగా వెళ్లి మరీ ఢీ కొట్టి ప్రమాదాన్ని బాధిత యువకులు కొనితెచ్చుకున్నారని స్థానికులు చెప్పారు. షార్ట్ కట్ పేరుతో రాంగ్ రూట్లో వెళ్లడం చాలా తప్పని, కాస్త ఆలస్యమైనా సవ్యంగా వెళ్లడం మంచిదని పోలీసులు సూచించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది.