బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీకొంది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ALSO READ :సిగరెట్ వల్లే.. ఫలూక్నుమా రైల్లో మంటలు వచ్చాయా?!
2023 జులై 07 గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో రాంగ్ రూట్ లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢికొట్టింది. అంతటితో ఆగకుండా బైక్ ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. బైక్ పై జీహెచ్ఎమ్ సీ ఏరియా మేనేజర్ బాల చందర్ యాదవ్ ప్రయాణించారు. బాల చందర్ యాదవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాల చందర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ BMW car ( TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.