గతంలో దొంగలంటే.. గళ్ల లుంగీ.. గుబురు మీసాలు.. కళ్లకు గంతలు.. చూడ్డానికి భయంకరంగా ఉండేవారని సినిమాల్లో చూశాం.. రాత్రి పూట మాత్రమే దోపిడీలకు పాల్పడేవారు.. కానీ ప్రస్తుతం పట్టపగలే రెచ్చిపోతున్నారు.. ఇంట్లో ఉన్నా.. షాపులో ఉన్నా.. లోపలికి చొచ్చుకుని వచ్చి మరీ దోచుకుంటున్నారు. అదీ అందరూ చూస్తుండగానే.. ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా చోర్ గాళ్లు చోరీ చేస్తున్నారు. అది రాత్రా.. పగలా అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. సోమవారం ఉత్తర ప్రదేశ్ లో పట్టపగలే ఓ షాపులో ప్రవేశించి దర్జాగా మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు ఇద్దరు దొంగలు.. వివరాల్లోకి వెళితే..
Also Read :- పక్షి ఆకారంలో మాస్క్.. అతని లక్ష్యం నెరవేరిందా లేదా..?
అది ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో రద్దీగా ఉండే ప్రాంతం. అందరూ ఎవరి పనిలో వారు బిజిబిజీగా తిరుగుతూనే ఉన్నారు. ఆ రద్దీలో ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు.. ఓ షాపులో ఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు. అందరూ చూస్తున్నారు.. పైగా మహిళ షాపు లోపల ఉంది.. మహిళతో పాటు మరొకొంతమంది ఉన్నారు. అయినా కూడా ఆ దొంగలు దర్జాగా నడుచుకుంటూ వచ్చి మరీ మహిళ మెడలోంచి తెంచుకొని బైక్పై పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
➡️#मुजफ्फरनगर दिनदहाड़े हुई लूट की घटना का लाइव विडियो सीसीटीवी कैमरे में हुआ कैद..
— Satya Sangam/सत्य संगम (@SatyaSangamLKO) August 28, 2023
➡️दुकान पर बैठी युवती से बाइक सवार दो बदमाशों ने की चेन स्नेचिंग, घटनास्थल पर पुलिस कर रही जांच पड़ताल
➡️नगर कोतवाली के सर्राफा बाजार का मामला#Muzaffarnagar @sspzuf pic.twitter.com/0HtzAw0Fvp