
మంచిర్యాల, వెలుగు: హోటల్ ముందు పార్కింగ్ చేసిన బైక్ ఎండ వేడితో కాలిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. చెన్నూర్‌కు చెందిన రవి సోమవారం మధ్యాహ్నం పనిమీద మంచిర్యాలకు వెళ్లాడు. ఐబీలోని ఓ హోటల్‌ముందు బైక్ పార్కింగ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని నీళ్లు పోసి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఎండవేడితోనే బైక్నుంచి మంటలు వచ్చాయని పలువురు పేర్కొన్నారు.