
జీడిమెట్ల, వెలుగు: బైక్ స్టార్ట్ చేస్తుండగా మంటలు చెలరేగి, పూర్తిగా కాలిపోయింది. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్కు చెందిన సంతోశ్ బైక్మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జౌట్పోస్ట్వద్ద ఉన్న దుకాణానికి వెళ్లి బైక్ స్పేర్ పార్ట్స్ కొన్నాడు. తిరిగి వెళ్లే క్రమంలో బైక్ స్టార్ట్ చేశాడు.
దీంతో మంటలు చెలరేగి, బైక్ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పూర్తిగా అగ్నికి ఆహుతైంది.