మాదాపూర్లో డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

మాదాపూర్లో  డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

 హైదరాబాద్ మాదాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో  వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్  అదుపు తప్పి డివైడర్ ను  ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.  ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా..ఆస్పత్రికి తీసుకెళ్తూ మరొకరు మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తీవ్రగాయాలైన ఒకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అయితే   బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మృతులు బోరబండకి చెందిన రఘుబాబు , ఆకాన్ష్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

ALSO READ | కలికాలం : 19 ఏళ్ల అమ్మాయి.. 16 పిల్లోడిపై లైంగిక దాడి