
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లి టెక్ మహేంద్ర వద్ద బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
అతివేగంతో బైక్ పై వెళ్లిన ఇద్దరు యువకులు..డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో యువరాజ్, నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృత దేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.