
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరాంఘర్ ఫ్లై ఓవర్(మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్) పైన బైక్ ఢివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం, ట్రిపుట్ రైడింగే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి వచ్చిన అత్తాపూర్ పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. జనవరి 28న రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు గోల్కొండ ఫతే దర్వాజాకు చెందిన మాజ్, అహ్మద్, తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ గా గుర్తించారు.
Also Read : హుస్సేన్‌సాగర్‌లో ఇంకా దొరకని యువకుడు ఆచూకీ
రాజేంద్రనగర్ ఏసిపి సంఘటన స్థలానికి చేరుకుని యాక్సిడెంట్ గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ప్రారంభంచిన అరంఘర్ ఫ్లైఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ఫ్లై ఓవర్ ఓపెన్ అయిన తర్వాత మొదటి ప్రమాదం ఇదేనని తెలుస్తోంది.