హైదరాబాద్ సిటీలో ప్రమాదకరమైన స్టంట్లతో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. సైబరాబాద్ రోడ్లే అడ్డగా మార్చుకొని విచ్చలవిడిగా బైక్ రేసింగులకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఆర్ధరాత్రి పూట బైక్ రైడర్స్ హంగామా సృష్టిస్తున్నారు. కార్లు, బైకులతో స్టంట్ లు చేస్తూ.. యువకులు రేసింగ్ నిర్వహిస్తున్నారు.
వీకెండ్స్ లో మరింత రెచ్చిపోతున్నారని... చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా కోరుతున్నారు స్థానికులు. ఐకియా నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్లో, రాయదుర్గం నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళే రూట్లలో యువకులు మరింత రెచ్చిపోతున్నారు.
ALSO READ :- సీలింగ్ ల్యాండ్‌లో కట్టడాలు కూల్చివేత
పోలీసులు హెచ్చరించినా ఖాతర్ చేయకుండా ప్రమాదక ఫీట్లు చేస్తున్నారు. ఈ స్టంట్లతో ప్రాణాలు కోల్పోతున్నా... యువత రేసింగ్ మాత్రం వదలడం లేదు. సోషల్ మీడియాలో లైక్ ల కోసం మరింత రెచ్చిపోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ ల పట్ల సీరియస్ గా ఉంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.