రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్స్ యువకుడు మృతి

రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్స్ యువకుడు మృతి
  •  ఒకరికి గాయాలు.. పెద్ద​ అంబర్​పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఘటన

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నగర్,వెలుగు : రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. వర్షంలో రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పెద్ద అంబర్​పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం సాయంత్రం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్‌‌‌‌లో నివాసం ఉంటున్న మేడ శివ(20) సంపత్, పవన్, విజయ్ స్నేహితులు. వీరు శనివారం సాయంత్రం ఎల్బీ నగర్ నుంచి కుంట్లూర్ వైపు వెళ్తున్నారు. సంపత్, శివ ఒక బైక్‌‌పై వెళ్తుండగా.. పవన్, విజయ్‌‌ శివ బైక్‌‌పై వెళ్తున్నారు.

 పెద్దఅంబర్ పేట్ వద్దకు రాగానే రీల్స్ కోసం వీరు బైక్ స్టంట్స్ చేశారు. బైక్ ముందు టైర్‌‌‌‌ గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేశారు. అయితే, అప్పటికే వర్షం పడుతుండటంతోసంపత్‌‌ బైక్‌‌ అదుపు తప్పి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బైక్‌‌ వెనకాల కూర్చున్న శివకు తీవ్ర గాయాలు కాగా, మిగతా స్నేహితులు అతన్ని స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్‌‌కు తరలించారు.

 శివను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన సంపత్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. శివ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో శివ తల్లి కన్నీరుమున్నీరయింది.