హైదరాబాద్: జోరుగా వాన.. ఇదే అదనుగా ఓ వ్యక్తి హుషారుగా అతని దొంగ తెలివితేటలు చూపించాడు. ఎవరికి అనుమానం రాకుండా సొంతబండినే తీసుకెళ్తున్నట్లు పార్కింగ్ చేసిన బైక్ లను జరిపి మరీ దర్జాగా ఎత్తుకెళ్లాడు. కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ బైక్ తనదే అన్నట్లుగా ఎవరైనా చూస్తారనే ఏమాత్రం జంగు లేకుండా ఎత్తుకెళ్లాడు దొంగ. పార్కింగ్ చేసిన బైక్లను జరిపి మరీ స్పెండర్ బైక్ తీసుకొని పరారయ్యాడు. బైక్ ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
కామాటిపురా పోలిస్ స్టేషన్ పరిధిలోని పురాణాపూల్ శ్మశానవాటిక ఎదురుగా ఉన్న శివాలయం బయట పార్క్ చేసిన ఓ స్ప్లెండర్ ప్లస్ బైక్ (AP12 N4563) ను నిన్న మధ్యాహ్నం సమయంలో ఓ దొంగ వచ్చి ఎలాంటి భయం లేకుండా దొంగతనం చేసి పరారయ్యాడు. రెండు వాహనాల మధ్య పార్క్ చేసి ఉన్న బైక్ను పక్కన ఉన్న బైకులను జరిపి మరీ స్ప్లెండర్ ప్లస్ బైక్ తనదే అన్న విధంగా దర్జాగా ఎత్తుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత గుడి బయట వచ్చి చూసిన బైక్ యజమాని పుష్పేందర్ తన వాహనం అక్కడ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కామాటిపురా పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమూదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.