జనగామ జిల్లాలో బైక్ ల దొంగ అరెస్ట్

జనగామ జిల్లాలో బైక్ ల దొంగ అరెస్ట్

స్టేషన్ ఘన్ పూర్,వెలుగు: ఆన్ లైన్​లో  బెట్టిం గ్ లు, చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు చోరీల బాట పట్టాడు. 6 బైక్ లతో పాటు అతడిని జనగామ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ పీఎస్ లో సోమవారం జనగామ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన ఉడుత హరీశ్(20) స్కూల్ మధ్యలోనే ఆపేసి.. బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ లు, చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.

2020లో ములుగు, స్టేషన్ ఘన్ పూర్ పీఎస్ ల పరిధిల్లో  4  చోరీలు చేసి  జైలుకు వెళ్లొచ్చాడు. 2024లో ఆత్మకూరు, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి పీఎస్  పరిధిల్లో 6 బైక్ లు, ఆటోను ఎత్తుకెళ్లాడు. వరుస చోరీలతో  పోలీసులు నిఘా పెట్టారు. స్టేషన్ ఘన్ పూర్  సీఐ వేణు సిబ్బందితో కలిసి సోమవారం వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోతో హరీశ్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా  చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని డీసీపీ తెలిపారు. ఏసీపీ భీంశర్మ,సీఐ వేణు,ఎస్ ఐ లు వినయ్ కుమార్, రమేశ్,  సిబ్బంది ఉన్నారు.