ఘరానా దొంగ అరెస్ట్.. 16 బైకులు స్వాధీనం

ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుపడ్డ నిందితుడు రంగు గంగాధర్(27) వద్ద నుండి 9 లక్షల రూపాయలు విలువచేసే 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్ లలో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాకు చెందిన రంగు గంగాధర్ జల్సాలకు బానిసై డబ్బు కోసం బైకుల చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.