నందిపేట, వెలుగు : బైక్ చోరీ చేసిన దొంగకు ఏడాది జైలు శిక్ష పడింది. వివరాలిలా ఇలా ఉన్నాయి.2023 డిసెంబర్ 9న సిద్దిపేట జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన గోపాల వంశీ.. నందిపేట మండల కేంద్రంలో తిమ్ముల పోశెట్టి కి చెందిన బైక్ను దొంగిలించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కేసును విచారించిన ఆర్మూర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వేముల దీప్తి నిందితుడికి ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.