జగిత్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మే 18వ తేదీ గురువారం మధ్యాహ్నం సమయంలో ఓ దొంగ పట్టపగలే తన చేతివాటం చూపించాడు. సీటీలోని దేవి శ్రీ గార్డెన్ సమీపంలో సాయిచంద్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. రోజు లాగే తన పనికి వెళ్లొచ్చిన సాయిచంద్ ఇంటి ముందు తన బైకును పార్కింగ్ చేశాడు. ఇంటి బయట ఎవరూ లేని సమయం చూసి అతని ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు.
ఆ దొంగ చోరీ చేసిన బైక్ తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగిత్యాల పట్టణం పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.