బైకు దొంగల బాల నేరస్తుడు అరెస్ట్

  • ఎనిమిది బైకులు పట్టివేత
  • ఆరో తరగతికే చదువుకు పుల్ స్టాప్

కమలాపూర్:  ఏజ్ ఏమో చిన్నది దొంగతనాలు మాత్రం పెద్దయ్. కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన 15 ఏండ్ల బాల నేరస్తుడి చోరీల వివరాలను గురువారం కాజీపేట ఏసిపి డేవిడ్ రాజ్ వెల్లడించారు. 

స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  బాల నేరస్తుడు అయినప్పటికీ పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ కొంతకాలంగా చోరీలు చేస్తున్నాడని, ఇప్పటికే  బాలునిపై పలు పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 

మైనర్ బాలుడు దొంగలించిన ఎనిమిది టూ వీలర్ వెహికల్స్ ను పట్టుకొని, మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు హాజరు పరచడం జరిగిందని తెలిపారు.బైక్ చోరీల కేసును చేదించిన సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంజీవ్ కుమార్, ఎస్ఐ పర్వీన్, ఏఎస్ఐ సురేష్, సిబ్బంది ఉన్నారు.