సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు బైక్ పై సౌత్ ఇండియా యాత్ర

అశ్వారావుపేట, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక ప్రాంతాలను సందడి చేయాలని ఉద్దేశంతో ఓ యువకుడు బైక్ పై సౌత్ ఇండియా యాత్రను ప్రారంభించాడు. యాత్ర ఆదివారం అశ్వారావుపేట పట్టణానికి చేరుకుంది. యువకుడు యశ్వంత్ మాట్లాడుతూ భువనేశ్వర్ నుండి ఈనెల 19వ తేదీ నుంచి  బైక్ పై సౌత్ ఇండియా యాత్రను చేపట్టినట్లు ఆయన చెప్పారు.  

ఇప్పటికే తాను ఏపీ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలను, సముద్ర తీరాలను దర్శించుకున్నానని స్పష్టం చేశారు.  కేరళ,  తమిళనాడు,  కర్ణాటక,  గోవా,  మహారాష్ట్ర మీదుగా తిరిగి తన స్వగ్రామమైన ఒరిస్సాకు యాత్ర ద్వారా చేరుకుంటానని తెలిపాడు.