రెండు బస్సుల మధ్య నలిగిన బైకర్.. సీసీ కెమెరా వీడియో

రెండు బస్సుల మధ్య నలిగిన బైకర్.. సీసీ కెమెరా వీడియో

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఓ టూవీలర్ నలిగిపోయి.. కొన ఊపిరితో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మరో 20 మందికి గాయాలయ్యాయి.

కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాలయంలో రెండు బస్సుల మధ్య ఒక బైకర్ పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళ్తున్న బైకర్, బస్సుకు ఎదురుగా వెళ్లాడు. అతన్ని ఢీకొట్టిన బస్సు, ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు బస్సుల్లో కలిపి మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదమంతా అక్కడ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

For more News..

జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్