OMA vs NAM 2024: చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. వన్డేల్లో అరుదైన రికార్డ్

OMA vs NAM 2024: చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. వన్డేల్లో అరుదైన రికార్డ్

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్‌గా ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్ లీగ్ లో భాగంగా నమీబియాతో జరిగిన ఈ మ్యాచ్ లో అతను ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ పాకిస్థాన్ పేసర్ షహీన్ అఫ్రిది పేరిట ఉంది. అతను 51 ఇన్నింగ్స్ ల్లో 100 వికెట్లను తీసుకోగా.. బిలాల్ ఖాన్ మాత్రం 49 ఇన్నింగ్స్ ల్లో 100 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.   

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 52 ఇన్నింగ్స్ ల్లో 100 వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్ గా ఈ రికార్డ్ నేపాల్‌కు చెందిన సందీప్ లామిచానే (42) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44) ఉన్నాడు. ఈ మ్యాచ్ లో బిలాల్ ఖాన్ (10-1-50-3) ఎకనామిక్ స్పెల్‌తో నమీబియాను ఒమన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196కి పరిమితమైంది. 197 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ ఆరు వికెట్లు కోల్పోయి 49.1 ఓవర్లలో ఛేజ్ చేసింది.   


వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు 

1) సందీప్ లామిచానే   -నేపాల్        -42
2) రషీద్ ఖాన్                -ఆఫ్ఘనిస్తాన్  -44
3) బిలాల్ ఖాన్              -ఒమన్         -49
4) షాహీన్ అఫ్రిది          -పాకిస్తాన్      -51
5) మిచెల్ స్టార్క్           -ఆస్ట్రేలియా  -52    

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)