10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిల్ కలెక్టర్

మేడ్చల్ జిల్లా : ఘట్ కేసర్ మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ రవీందర్ పది వేల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి ఓ బాధితుడి నుంచి లంచం తీసుకున్న రూ.10వేల నగదును సీజ్ చేశారు. బిల్ కలెక్టర్ రవీందర్ నివాసంలోనూ మరో బృందం ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఏసీబీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో చౌదరి సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా అనుమానితులుగా కనిపించిన పలువురి మొబైల్ ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే పంచాయతీ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడి చేసి బిల్ కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సోదాలు జరపడం చర్చనీయాంశం అయింది. 

 

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ కిక్కు: బౌలర్లే హీరోలవుతున్నరు..!

పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు