రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మార్చి 1, 2, 3 రోజుల్లో ఘనంగా జరిగాయి. ఆదివారం (మార్చి3)న ప్రీవెడ్డింగ్ వేడుకలు ముగిశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు సెంట్రర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రముఖ టెక్ సంస్థ మెక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఈ వేడుకలకు హాజరైయ్యారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా బిల్‌గేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పౌలా హర్డ్‌తో బిల్‌గేట్స్ ప్రేమ, రెండో పెళ్లి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
ALSO READ :- మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్యనే ఈ పౌలా హర్డ్. క్యాన్సర్‌తో చాలాకాలం పోరాడిన మార్క్ 2019లో మరణించారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిలిందా, బిల్ గెట్స్ వివాహామైన 27 సంవత్సరాల తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరి విడాకులపై చాలా రూమర్స్ వచ్చాయి.