గ్లోబల్ లీడర్ ఇండియా.. ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయాన్ని మార్చింది: బిల్ గేట్స్

గ్లోబల్ లీడర్ ఇండియా.. ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయాన్ని మార్చింది: బిల్ గేట్స్
  • హెల్త్, టెక్, AI రంగంలో ఇండియా గ్రేట్: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు.ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయ రంగాల అభివృద్దిలో భారత్ ప్రభావాన్ని హైలైట్ చేశారు.ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం, భారతదేశం సాధించిన పురోగతిని గుర్తు చేశారు బిల్ గేట్స్.

మూడోసారి భారత్ కు రానున్న బిల్ గేట్స్.. గత దశాబ్దాలుగా దేశం సాధించిన విజయాలను లింక్డ్ ఇన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారత్ తో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కు ఉన్న అనుబంధం, భాగస్వామ్యాన్ని చెపుతూ పోస్ట్ చేశారు.  గత రెండు దశాబ్దాలుగా బిల్ గేట్స్ ఫౌండేషన్ , భారత ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి ఎన్నో విజయాలు సాధించేందుకు కృషి చేసిందన్నారు. 

ప్రజారోగ్యంలో భారత్ సాధించిన విజయాలను ప్రశంసించారు బిల్ గేట్స్. ముఖ్యంగా పోలియో నివారణలో భారత్ గొప్ప విజయం సాధించిందన్నారు. 2011లో పర్యటనలో ఉన్న సందర్భంలో భారత్ చివరి పోలియో కేసును చూసిందన్నారు. రోగనిర్ధారణకు కొత్త ఎక్విప్ మెంట్స్, AI  ద్వారా రోగాల గుర్తింపు, అరుదైన చికిత్స వ్యూహాల్లో దేశం ఇన్వెస్ట్ మెంట్, క్షయవ్యాధిపై పోరాటంలో భారత్ లీడర్ షిప్ ను బిల్ గేట్స్ హైలైట్ చేశారు. 

బిల్ గేట్స్ తన పర్యటన సందర్భంగా ప్రపంచం భవిష్యత్తును రూపొందించే భారత అధికారులు, శాస్త్రవేత్తలు ,దాతలతో సమావేశం కానున్నట్లు పోస్ట్ లో రాశారు. ఈ మైలురాయికి భారతదేశం సరైన ప్రదేశం"అని ఆయన ముగించారు.