మైక్రోసాఫ్ట్(Microsoft) కో ఫౌండర్ బిల్ గేట్స్(Bill Gates) స్వంతంగా పాడ్‌కాస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్‌కన్‌ఫ్యూజ్ మీ విత్ బిల్ గేట్స్(Unconfuse me with bill gates) అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రామ్‌కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల ఈ ప్రోగ్రామ్ రెండో ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్(Sal khan)ను ఇంటర్వ్యూ చేశారు బిల్ గేట్స్.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిల్ గేట్స్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) గురించి సాల్ ఖాన్‌ను ప్రశ్నించారు. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ వ్యక్తి కనిపించారా అని సల్మాన్ ఖాన్ ఫోటోను చూపించారు బిల్ గేట్స్. ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి కూడా మీరు ఎప్పుడు కన్‌ఫ్యూజ్ కాలేదా అని ప్రశ్నించారు గేట్స్.
ఆ ప్రశ్నకు సమాధానంగా సాల్ ఖాన్ స్పందిస్తూ .. సల్మాన్ ఖాన్ గురించి నాకు తెలుసు. నేను ఈ అకాడమీ ప్రారంభించిన కొత్తలో.. ఆయన ఫ్యాన్స్ నుండి నాకు చాలా మెయిల్స్ వచ్చేవి. అందులో నువ్వంటే నాకు ఇష్టమని, కానీ మీరు గణితాలు అంత సులువుగా ఎలా ఎలా చేస్తారో అని ఆ లేఖలో రాసేవారని తెలిపారు సాల్ ఖాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిల్ గేట్స్ చేతిలో తమ అభిమాన హీరో ఫోటో చూసి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.