టెన్నిస్‌‌ టోర్నీలో ఇండియా రెండో విజయం

టెన్నిస్‌‌ టోర్నీలో ఇండియా రెండో విజయం

పుణె: బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్‌‌ టోర్నీలో ఇండియా రెండో విజయాన్ని అందుకుంది. ఆసియా ఓసియానియా గ్రూప్‌‌–1లో భాగంగా గురువారం జరిగిన మూడో మ్యాచ్‌‌లో ఇండియా 2–1 తేడాతో హాంకాంగ్‌‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌‌లో వైదేహి చౌదరి 7–6 (10/8), 6–1తో హో చింగ్‌‌ యుపై గెలిచింది. రెండు గంటలా 3 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ అద్భుతమైన స్ట్రోక్స్‌‌తో ఆకట్టుకుంది. 

రెండో సింగిల్స్‌‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 7–6 (8/6), 2–6, 6–3తో హంగ్ యి  వాంగ్‌‌ను ఓడించడంతో ఇండియా 2–0 లీడ్‌‌లో నిలిచింది. డబుల్స్‌‌లో అంకితా రైనా–ప్రార్థన తోంబరే 7–6 (7/2), 3–6, 11–13తో ఎడుసి చాంగ్‌‌–హంగ్‌‌ యి  వాంగ్‌‌ చేతిలో పరాజయంపాలయ్యారు. రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌‌లో ఇరుజట్లు విజయం కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో చెరో సెట్‌‌ నెగ్గాయి. కానీ డిసైడర్‌‌లో హాంగ్‌‌కాంగ్‌‌ ప్లేయర్లు మెరుగైన షాట్లతో పైచేయి సాధించారు.